English | Telugu
ఆది పురుష్ విషయంలో దర్శకుడు క్లారిటీ ... నమ్మకం కుదరడం లేదు!
Updated : Jan 9, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుష్. ఈ చిత్రం విఎఫ్ఎక్స్ పనులు బాగా లేకపోవడంతో విడుదలైన టీజర్ కు విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. దాంతో ప్రభాస్ పట్టు పట్టి మరల మొదటి నుంచి వి ఎఫ్ ఎక్స్ పనులను పై దృష్టి సారించేలా చేశారు. దాంతో ఈ చిత్రం ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ చిత్రం టీజర్ చూసినవారు ఇదేదో నాడు తన కూతురి దర్శకత్వంలో రజినీకాంత్ చేసిన విక్రం సింహాలా యానిమేటెడ్, కార్టూన్ ఫిల్మ్‌లను పోలి ఉందని కామెంట్లు చేశారు.
ఆది పురుష్ సినిమా మీద వచ్చినన్ని ట్రోల్స్ ఇంకే సినిమా మీద వచ్చి ఉండవని కచ్చితంగా చెప్పవచ్చు. ఆదిపురుష్ విఎఫ్ ఎక్స్ టీమ్ మీద దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. దాంతో ఈ టీమ్ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. ఈ సినిమాను మొబైల్ కోసం తీయలేదని థియేటర్లలో చూసేందుకు తీశామని 3 డిలో చూస్తే అనుభూతి వేరు అంటూ ఓం రౌత్ తన తప్పులను తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ చివరకు రిపేర్లు మొదలు పెట్టేశారు.
ఆదిపురుష్ సినిమా వీ ఎఫ్ ఎక్స్ పనులు పూర్తిగా వచ్చింది. అయితే తాజాగా ఓంరౌత్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా విషయంలో కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. మేము వాటిని స్వీకరించాం. మనం తీసే సినిమా విషయంలో చివరి నిమిషం వరకు మనం కష్టపడాల్సిందే. మన ప్రోడక్ట్ బాగా రావడానికి మనం చివరి వరకు ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం. నేను ఏ ఒక్కరి నిరాశపరచను. నేటి యువతకు ప్రపంచానికి మన రాముడిని చూపించాలని ఆయన గురించి చెప్పాలని చేస్తున్న ప్రయత్నం ఇది అంటూ ఓంరౌత్ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఈ చిత్రం కొత్త టీజర్ ట్రైలర్ విడుదల కానిదే మనం ఓ నిర్ణయానికి రాలేం కూడా.. ప్రభాస్ కూడా అదే ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది.
అందుకే ఆయన సలార్ మూవీని వేగంగా పూర్తి చేస్తున్నారు. ఆది పురుష్ విషయంలో ఏదైనా తేడా వచ్చినా మరోసారి విఎఫ్ఎక్స్ పనులను మొదలుపెట్టించేలా ఆయన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. వీలైతే ఆధిపరుష్‌ను వెనక్కి నెట్టి సలార్ మూవీ తో ముందుగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆయన ప్రణాళికలు రచిస్తున్నాడు. మరి ఆది పురుష్ సలార్లలో ఏ చిత్రం ముందుగా విడుదలవుతుందో చూడాలి ఎందుకంటే ఆది పురుష్‌పై ఇంకా టీజర్ను చూసిన ప్రేక్షకులకు ఓం రౌత్ ఎంత చెప్పినా నమ్మకం కుదరడం లేదు. దీనిబట్టి సినీ ప్రేక్షకులు ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు సంతృప్తి పడేలా ఆదిపురుష్ పూర్తి అవుట్ ఫుట్ వచ్చిన తర్వాతే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చే సాహసం చేస్తారని ఖచ్చితంగా చెప్పవచ్చు.