English | Telugu

తన న్యూ ఇయర్ గోల్స్ ను రివీల్ చేసిన ఫైర్ బ్రాండ్‌!

తెలుగులో ప్రస్తుతం ఫైర్ బ్రాండ్ అంటే అనసూయ భరద్వాజ్ పేరు చెప్పుకోవాలి. నా రూటే సపరేటు అన్నట్టుగా ఆమె తాను అనుకున్నది ఎవరేమనుకున్నా తాను చేసి నేనింతే అంటోంది. ఈమె ఎవరి మాటలను లెక్కచేయదు.తన మనసుకు నచ్చింది చేస్తానని అంటుంది. ఈమె తనకు నచ్చనివి ఎవరేమనుకున్నా వాటిలో మంచి ఉన్నా సరే ఆమె చేయదు. నాకు నచ్చింది చేస్తానంటుంది. ప్రతి ఒక్కరితోనూ గిల్లికజ్జాలు పెట్టుకుంటూ ఉంటుంది.నెటిజన్లను, తనను ట్రోల్ చేసేవారిని అస్సలు లెక్క పెట్టదు. అంతేకాదు నువ్వు ఒకటి అంటే నేను నాలుగు అంటాను అని వారితో త‌గ‌వు పెట్టుకుంటుంది. ఇక విషయానికి వస్తే అనసూయ భరద్వాజ్. 2023 కొత్త ఏడాదిలో ఒక నాలుగు ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకుంది.అందులో మొదటిది నెగటివ్ మైండెడ్ పీపుల్ కి దూరంగా ఉండటం.ఎంతసేపటికీ నెగ‌టివ్ ఆలోచనలు చేస్తూ నెగటివ్ మైండ్ తో మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే వారికి దూరంగా ఉండాలని ఆమె భావిస్తోంది. ఒకవేళ తన పక్కన అలాంటి వారు ఉన్నా కూడా వారిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది.ప్రతికూల ప్రభావాలు తన ఆత్మ బ‌లాన్ని దెబ్బతీయకుండా చూసుకోవడం పై తన దృష్టిని సారించింది. ఇక రెండోది ఏమిటంటే మన పెద్దలు చెప్పిన ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని
ఇకపై ఆమె చాలా జాగ్రత్తగా అమలు చేయనుందట. సరైన ఆహారం తీసుకోవడం, అన్ని విషయాలకు సరైన సమయాన్ని కేటాయించడం, వ్యాయామం చేయడం, బాడీని ఫిట్ గా ఉంచుకోవడం, ఎప్పటికప్పుడు తన ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోవడం, ఏదైనా తేడా ఉంటే దానికి కారణాలను కనుక్కొని దానిని సరి చేసుకోవడం పై ఈమె తన దృష్టి కేంద్రీకరించింది. ఇక తన మూడో ప్రాధాన్యాన్ని ఆమె డబ్బుకు ఇచ్చింది. డబ్బున్న వాడు రాజు కంటే బలవంతుడు. ధనమేరా అన్నిటికీ మూలం ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అనే సూత్రాన్ని పాటించి కిందటి ఏడాది కంటే ఈ ఏడాది మరింత ఎక్కువగా తన సంపాదనను పెంచుకోవాలని ఈమె భావిస్తోంది. ఆపదలలో ఆదుకునేది మనీ నే కాబట్టి మనీ మేక్ మినీ థింగ్స్ అన్నట్టుగా ఈమె మ‌నీకి ఇంపార్టెన్స్ ఇవ్వనుంది. డబ్బుంటే కొండ మీద కోతి అయినా దిగివస్తుంది అనే ఆలోచన ఈమెకి వంట‌ప‌ట్టింది. ఇక నాలుగవ ప్రాధాన్యం మాన‌సిక ప్ర‌శాంత‌త‌. డబ్బు సంపాదనలో ప‌డి మానసిక ఆరోగ్యాన్ని కోల్పోవడం ఇష్టం లేదు. అందుకే పీస్ ఆఫ్ మైండ్ కి ప్రాధాన్యం ఇవ్వాల‌ని అంటోంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే అన్నీ సక్రమంగా జరుగుతాయి. మనము కూడా చేయాల్సిన పనులను చక్కగా చేస్తామని భావించిన ఈమె దానికి నాలుగ‌వ ప్రాధాన్యాన్ని కేటాయించింది. మొత్తానికి అనసూయ చెప్పిన నాలుగు పాయింట్లు నిజ జీవితం లో సరైనవే అనే చెప్పాలి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దాదాపు ఈ సూత్రాలన్నీ ఆమె ఎప్పటి నుండో పాటిస్తోంది. కామెంట్ చేసే వారిని పట్టించుకోకుండా అవసరమైతే వారిపై ఎదురు దాడి చేస్తుంది. నిత్యం వర్కౌట్ లతో తన బాడీ ని ఆంటీ వయసులో కూడా 16 ఇయర్స్ బ్యూటీగా మార్చుకుంటోంది.

ఇక మూడోది డబ్బు... ఆమె ఆల్రెడీ డబ్బు తక్కువగా వస్తుందని, సంపాదన తక్కువగా ఉందని భావించే బుల్లితెర కు బై బై చెప్పి కాస్త ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి డబ్బు సంపాదించి పెట్టే .... భవిష్యత్తు తన రేంజ్ ని మరింత ముందుకు తీసుకుని వెళ్లి భవిష్యత్తులో మరింత సంపాదన వచ్చేలా చేసే వెబ్ సిరీస్, సినిమాలపై దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుతం ఆమె ఒక్క కాల్ షీట్ కు మూడు లక్షలకు పైగానే డిమాండ్ చేస్తోందట. అలాగే పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌ల‌కు కూడా హాజ‌ర‌వుతోంది. అది మహా అయితే రెండు మూడు గంటల పని. కానీ దానికి ఆమె వసూలు చేసే మొత్తం ఏకంగా పది లక్షలు. సినిమాలు, వెబ్ సిరీస్,ప్రమోషన్స్,సోషల్ మీడియా ద్వారా మరింత సంపాదనను ఆశిస్తోంది. మొత్తానికి తాను నిర్దేశించుకున్న కొత్త లక్ష్యాలకు అనుగుణంగా ఆమె ఇప్పటికే తొలి అడుగులు వేస్తోంది కాబట్టి ఈ ఏడాదిలో ఆమె వీటిని మరింత బలంగా చేసుకుని తన స్థాయిని పెంచుకునే ఆలోచనలో ఉంది...!

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.