English | Telugu

'ధమాకా' సంచలనం.. పదో రోజు తెలుగునాట నాన్-రాజమౌళి రికార్డు!

మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం 'ధమాకా' కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 23న విడుదలైన ఈ సినిమా నిన్న(ఆదివారం) పదో రోజు అయినప్పటికీ మొదటి రోజు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో పదో రోజు కలెక్షన్స్ పరంగా నాన్-రాజమౌళి రికార్డు సృష్టించి సత్తా చాటింది.

తెలుగు రాష్ట్రాల్లో పదో రోజు అత్యధిక షేర్ రాబట్టిన సినిమాగా మొదటి మూడు స్థానాల్లో 'ఆర్ఆర్ఆర్'(రూ.16.10 కోట్లు), 'బాహుబలి-2'(రూ.8.55 కోట్లు), 'బాహుబలి-1'(రూ.5.45 కోట్లు) ఉన్నాయి. ఈ మూడు సినిమాలకు దర్శకుడు రాజమౌళి అనే సంగతి తెలిసిందే. ఇక నాలుగో స్థానంలో రూ.3.88 కోట్ల షేర్ తో 'రంగస్థలం' ఉండగా.. ఇప్పుడు ఆ స్థానాన్ని ధమాకా భర్తీ చేసింది. పదో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.4.20 కోట్ల షేర్ వసూలు చేసి.. నాన్-రాజమౌళి రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే పదో రోజు సుమారుగా ఐదు కోట్ల(రూ.4.90 కోట్లు) షేర్ రాబట్టడం విశేషం. యావరేజ్ టాక్ తో పదో రోజు ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టడం చూసి ట్రేడ్ విశ్లేషకులే ఆశ్చర్యపోతున్నారు.

పది రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.29.27 కోట్ల షేర్ రాబట్టిన ధమాకా.. వరల్డ్ వైడ్ గా రూ.34.37 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. రూ.19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ మూవీ.. ఇప్పటికే భారీ ప్రాఫిట్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాల తాకిడి లేకపోవడంతో.. ధమాకా మరో పది కోట్ల షేర్ రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.