English | Telugu

నీ బుర్రలో ఏముందో మర్చిపోయి నోటికొచ్చింది మాట్లాడాతావా..బండ్ల గణేష్ పై షకలక శంకర్ కౌంటర్

బండ్ల గణేష్ మార్క్ కాంట్రవర్సీ స్పీచ్ కి ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ గట్టి కౌంటర్ వేసాడు. రవితేజ నటించిన "ధమాకా" మూవీ సక్సెస్ మీట్ లో యాక్టర్, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మాట్లాడాడు.. "రవితేజను చూసి చాలా నేర్చుకోవాలి అని చెప్పాడు. ఎంతో కష్టపడి, స్వయంకృషితో పైకొచ్చాడని అన్నారు. ఒకటి రెండేళ్లు కష్టపడి అదృష్టం కలిసి వచ్చి కొంతమంది మెగా స్టార్స్, సూపర్ స్టార్స్ ఐపోతారు. కానీ రవితేజ అలా కాదు అసిస్టెంట్ డైరెక్టర్ ఐనా సరే, చివరికి ప్రొడక్షన్ బాయ్ ఐనా సరే ఇండస్ట్రీలోనే ఉంటానని డిసైడ్ అయ్యి ఎంతో సాధించాడు.. ఎంతోమందికి అవకాశాలు కూడా ఇచ్చాడు అందుకే రవితేజ అంటే ఒక ఇన్స్పిరేషన్" అని చెప్పుకొచ్చాడు.

ఇదే టైంలో ఆయన వీరావేశంతో చేసిన కామెంట్స్ కి ఒకప్పటి జబర్దస్త్ కమెడియన్, షకలక శంకర్ కౌంటర్ ఇచ్చాడు. "అదృష్టం కొద్దీ ఎవరూ మెగాస్టార్స్, సూపర్ స్టార్స్ ఎవరు..వాళ్లకు ఆ స్టార్ డం రావడానికి ఎన్నో ఏళ్ళు కష్టపడితే వచ్చింది. ఎందుకోసం అన్నాడో ఏమో తెలీదు, నీ ఎదురుగా ఎవరో హీరో కూర్చుని ఉంటే నోటికి ఏదొస్తే అదే మాట్లాడేస్తావా..ఇలా మాట్లాడ్డం కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు అంటున్న ఈ మాటలు ఎవరికీ ఎలా కనెక్ట్ అవ్వాలో వాళ్లకు కనెక్ట్ అవుతుంది. పేరు చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే మనకంత లేదు కాబట్టి " అని ఫైర్ అయ్యాడు షకలక శంకర్. మెగా ఫామిలీకి వీరాభిమానుల్లో శంకర్ కూడా ఒకడు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా. ఆయన్ని ఎవరైనా ఏమన్నా అంటే అస్సలు ఊరుకోడు.