English | Telugu

దేవిశ్రీ ఫింగర్‌కి ‘పులి’ రింగు...

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇటు తెలుగుతోపాటు అటు తమిళ్ సినిమాల్లో కూడా మ్యూజిక్ వాయించేస్తున్నాడు. ఈ చేత్తో తెలుగు, ఆ చేత్తో తమిళ్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చేస్తూ బిజీ బిజీగా వున్నాడు. సమకాలీన యువ సంగీత దర్శకులలో దేవిశ్రీ ప్రసాద్ అగ్రపథంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు దేవిశ్రీ తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాకి సంగీతం ఇచ్చాడు. శింబుదేవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా పేరు ‘పులి’. ఈ సినిమా తెలుగులో కూడా రాబోతోంది. తెలుగు టైటిల్ ఇంకా కన్ఫమ్ చేయలేదు. ఇది సైంటిఫిక్ ఫాంటసీ సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం విని నిర్మాతలు పి.టి.సెల్వకుమార్, శిబు ఫ్లాటైపోయారట. సూపర్ సంగీతం ఇచ్చావంటూ అభినందనలతో సరిపెట్టకుండా ఒక ఉంగరాన్ని కూడా ఇచ్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారట. తనకు ఆ ఉంగరం ఎంతో నచ్చేసిందని, ఇక తన వేలికి ఆ ఉంగరం పెట్టుకునే వుంటానని దేవిశ్రీ ప్రసాద్ అంటున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా సంగీతం విడుదలయ్యాక వింటే మనకీ తెలుస్తుంది... ఆ మ్యూజిక్‌కి ఉంగరం ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చారో...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.