English | Telugu
తమిళంలో హిట్టు కథా చిత్రమ్....
Updated : Jan 17, 2015
తెలుగులో సక్సెస్‌ఫుల్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలో కూడా అనేక చిత్రాలను నిర్మించింది. ఆ సినిమాల ద్వారా అనేక హిట్లు కూడా కొట్టిన చరిత్ర గీతా ఆర్ట్స్‌కి వుంది. అయితే ఇటీవలి కాలంలో తెలుగుమీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేసిన ఈ సంస్థ తమిళ సినిమా రంగానికి దూరంగా వుంటూ వచ్చింది. ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత గీతా ఆర్ట్స్ సంస్థ తమిళంలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ ఇవ్వడం ఇవ్వడం తెలుగులో విజయం సాధించిన ‘ప్రేమ కథా చిత్రమ్’ సినిమాతో ఇచ్చింది. ఈ సినిమాని ‘డార్లింగ్’ పేరుతో రీమేక్ చేసింది. ఇందులో హీరో ఎవరో కాదు.. ఎ.ఆర్.రెహమాన్ మేనల్లుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్. ఈమధ్య విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా విజయం సాధించిందని తెలుస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చాక ఒక హిట్‌తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడం గీతా ఆర్ట్స్ వర్గాలకు బోలెడంత సంతోషాన్ని కలిగిస్తోందని సమాచారం.