English | Telugu

వర్మ డిపార్ట్ మెంట్ లో హీరోగా రానా

వర్మ...రామ్ గోపాల వర్మ తాను తీయబోతున్న "డిపార్ట్ మెంట్" అనే చిత్రంలో హీరోగా దగ్గుపాటి రానాని తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ పోలీస్ డిపార్ట్ మెంటుకి సంబంధించిన కథతో త్వరలో తాను తీయబోయే "డిపార్ట్ మెంట్" సినిమాలో హీరోగా మన తెలుగు హీరో దగ్గుపాటి రానాని తీసుకున్నారట. ప్రస్తుతం రామ్ గోపాల వర్మ "బుడ్డా" అనే చిత్రాన్ని పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, తాను నిర్మాతగా మారి హిందీలో నిర్మిస్తున్నారు.

ఇటీవల ఆయన తెలుగులో తీసిన "కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు" సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత రామ్ గోపాల వర్మ ప్రయోగాత్మకంగా కేనన్ 5డి కెమెరాతో, రవితేజ, ఛార్మి, మంచు లక్ష్మీ ప్రసన్న, ప్రకాష్ రాజ్, సునీల్, బ్రహ్మానందం వంటి వారితో స్వీయ దర్శకత్వంలో తీసిన "దొంగల ముఠా" చిత్రం కూడా ఢమాల్ అనటంతో మళ్ళీ తెలుగు నుంచి హిందీ వైపే మొగ్గు చూపిన వర్మ ఈ "డిపార్ట్ మెంట్" చిత్రాన్ని హిందీలో తీస్తున్నారు. రానా ఇప్పటికే హిందీలో "దమ్‍ మారో దమ్" అనే చిత్రంతో హిందీ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అందుకేనేమో వర్మ అతన్ని తన "డిపార్ట్ మెంట్" సినిమాలో హీరోగా తీసుకుంటున్నాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.