English | Telugu
నీ సంగతి చెప్తా.. ఎన్టీఆర్ కి దగ్గుబాటి హీరో వార్నింగ్!
Updated : Oct 18, 2023
జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఎంతో పవర్ ఫుల్ గా డైలాగ్ లు చెప్తాడు. "చావుకి గనక గొంతుంటే ఇట్నే వుంటాదా" అనే రేంజ్ లో వార్నింగ్ తోనే చావు భయం కలిగించగలడు. అలాంటి ఎన్టీఆర్ కి రియల్ లైఫ్ లో దగ్గుబాటి హీరో వార్నింగ్ ఇచ్చాడు. అది సీరియస్ గా కాదులేండి.. సరదాగానే.
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు, హీరో రానా సోదరుడు అభిరామ్.. తేజ దర్శకత్వంలో రూపొందిన 'అహింస' సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. సినీ నేపథ్యమున్న కుటుంబం కావడం, కొన్ని సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేయడంతో ఆయనకు సినీ పరిశ్రమలో ఎందరో హీరోలతో మంచి అనుబంధముంది. తాజాగా తెలుగు వన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి అభిరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
"ఎన్టీఆర్ గారి డ్యాన్స్ కి, పర్ఫామెన్స్ కి హ్యాట్సాఫ్. కలిసినప్పుడు మేము బాగా మాట్లాడుకుంటాం. చిన్నప్పుడు నేను ఆయనకు ఒకటి చెప్పా.. వస్తున్నా, నేను కూడా దిగుతా అప్పుడు చెప్తా నీ సంగతి అని. ఇప్పుడు నన్ను ఎగతాళి చేస్తాడు. అరే భయమేస్తుందిరా.. నువ్వు దిగావు ఇండస్ట్రీలోకి, నన్ను పంపిస్తావు ఇంటికి అంటాడు. అలా సరదాగా ఉంటాం." అంటూ ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు అభిరామ్.