English | Telugu

మార్క్ శంకర్ మాఇంటికి వచ్చేసాడు..చిరంజీవి ప్రకటన  

పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చిన్నకొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకొని గాయాలపాలైన విషయం తెలిసిందే.దీంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు.

రీసెంట్ గా మార్క్ శంకర్(Mark Shankar)ఆరోగ్యం గురించి ఎక్స్ వేదికగా చిరంజీవి(Chiranjeevi)స్పందిస్తు మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి.మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతోత్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానేవుంటాడు.
రేపుహనుమత్ జయంతి,ఆ స్వామి ఓ పెద్దప్రమాదంనుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు.

ఈసందర్భంగా ఆయాఊళ్ళల్లో, ఆయాప్రాంతాల్లో మార్క్శంకర్కోలుకోవాలని ప్రతిఒక్కరూ మాకుటుంబానికి అండగా నిలబడి మా బిడ్డకోసంప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులుఅందచేస్తున్నారు.నాతరపున,తమ్ముడుకళ్యాణ్బాబు తరపున,మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలుతెలియచేస్తున్నామంటు ట్వీట్ చేసాడు.