English | Telugu
చండీ ప్లాటినం డిస్క్ వేడుక
Updated : Sep 5, 2013
ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "చండీ". ఈ చిత్ర ప్లాటినం డిస్క్ వేడుక బుధవారం హైదరాబాదులో జరిగింది. ఈ సందర్భంగా నటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ... ఈ చిత్రంలో ప్రియమణి చాలా అద్బుతంగా నటించింది. సంగీత దర్శకుడు ఎస్.ఎన్. శంకర్ మంచి సంగీతాన్ని అందించాడు. ఈ ఆడియోలో అల్లూరి సీతారామరాజు పాటకు మంచి స్పందన వస్తుంది అని అన్నారు.
ప్రియమణి మాట్లాడుతూ... నా కెరీర్ లోనే చండీ చిత్రం ఏంతో ప్రత్యేకం. ఇందులో కృష్ణంరాజుగారి కూతురిగా నటించడం ఓ మధురానుభూతి. శరత్ కుమార్ గారు కూడా ఓ ప్రధాన పాత్రలో నటించడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.
ఈ వేడుకకు విచ్చేసిన రెజినా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ నెలలోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, త్వరలోనే విడుదల తేదిని అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు.