English | Telugu

మళ్లీ వివాదంలోకి చక్రి ఆస్తులు..చక్రి తల్లి దీక్ష

దివంగత సంగీత దర్శకుడు చక్రి ఆస్తుల వివాదం ఇంకా కొనసాగుతోంది. చక్రి మరణం తర్వాత ఆస్తుల విషయంలో, చక్రి భార్య శ్రావణికి, ఆయన తల్లి, సోదరుడితో వివాదాలు నడిచిన సంగతి తెలిసిందే. ఇవి మొదలై దాదాపు ఏడాదిన్నర అయినా, ఇంకా కొలిక్కి రాలేదు. అప్పట్లో జూబ్లీహిల్స్ పిఎస్ లో చక్రి భార్య, తల్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.

తాజాగా, సోమాజిగూడలో వరుణ్ సర్గం విల్లా దగ్గర చక్రి తల్లి విద్యావతి, సోదరుడు మహిత్ దీక్షకు దిగారు. ఆ విల్లాలో ఉంటున్న మాధవి అనే మహిళ, విల్లాను ఖాళీ చేయట్లేదని, గత 8 నెలలుగా అద్దెను కూడా చెల్లించట్లేదని, శ్రావణే వెనక ఉండి ఇదంతా నడిపిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. కొద్ది కాలం క్రితమే, చక్రి భార్య శ్రావణి, ఆస్తుల్ని అమ్మేసి, అమెరికా వెళ్లిపోయిందని, ఈ విల్లా తమకే దక్కుతుందని చక్రి సోదరుడు మహిత్ చెబుతున్నారు. ఫ్లాట్ లో సామాన్లు కూడా తమవేనని, మాధవి ఖాళీ చేయకుండా ఇబ్బంది పెడుతోందంటూ, విల్లా ముందు విద్యావతి, మహిత్ నారాయణ్ దీక్షకు దిగారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.