English | Telugu
అభిమానే శత్రువా..?
Updated : Mar 1, 2016
బాలీవుడ్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఫ్యాన్. 50 ఏళ్ల వయసులోనూ టీనేజ్ కుర్రాడిలా అదరగొట్టిన షారుఖ్ టాక్ ఆఫ్ ది బీటౌన్ గా మారిపోయాడు. బాద్ షా ఫ్యాన్స్ అంతా ఎదురుచూసిన ఫ్యాన్ ట్రైలర్ రిలీజ్ అయింది. స్టోరీ ఎలా తీసుంటాడబ్బా అన్న ఉత్సుకతకు, ఈ ట్రైలర్ ద్వారా కొద్దిగా సమాధానం లభించే అవకాశం ఉంది. ఆర్యన్ ఖన్నాకు భీభత్సమైన ఫ్యాన్ గౌరవ్. ఆ అభిమానం కాస్తా, మరీ ఎక్కువై పిచ్చిగా మారుతుంది. ఆర్యన్ ను కలిసినప్పుడు అతను చెప్పిన సమాధానంతో మనసు గాయపడిన గౌరవ్ అభిమానం కాస్తా శత్రుత్వంగా మారుతుంది. ఇదీ, ట్రైలర్ బట్టి మనకు అర్ధమయ్యే ట్విస్ట్. సినిమాలో మరిన్ని ట్విస్టులున్నాయంటూ, మూవీ టీం ఊరిస్తున్నారు. ఇప్పటికే ఉన్న అంచనాలను మరింతగా పెంచేలా ఫ్యాన్ ట్రైలర్ ఉందనడంలో అనుమానం లేదు. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం, ఏప్రిల్ వరకూ ఆగాల్సిందే..