English | Telugu
' పోకిరిరాజా 'గా వస్తున్న రంగం జీవా
Updated : Mar 1, 2016
2011లో వచ్చిన రంగం చిత్రంతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు స్టార్ హీరో జీవా. ఆ తర్వాత తెలుగులో వచ్చిన స్నేహితుడు, మాస్క్, చిరునవ్వుల జిరుజల్లు చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపును అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి పోకిరి రాజా పేరుతో తెలుగు ప్రేక్షకుల మందుకు రాబోతున్నాడు. ఫన్ ఆఫ్ విండ్ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా తమిళంలో జీవా నటించిన 25వ చిత్రం కావడంతో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. జీవా సరసన హన్సిక మోత్వానీ హీరోయిన్ గా చేసింది. రామ్ ప్రకాష్ రాయప్ప డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రముఖ నటుడు సత్య రాజ్ తనయుడు సిబిరాజ్ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ గా ఉంటాయంటోంది మూవీ టీం. కామెడీ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా సినిమాను తెరకెక్కించారు.
సాయి గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మలిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ, వి.హానీ ప్రమోధ్, శ్రీను సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు పోకిరి రాజాను అందిస్తున్నారు. తెలుగులో కూడా ఈ సినిమా హక్కులు భారీ ఫ్యాన్సీ రేటు పలకడం విశేషం. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి, అత్యధిక థియేటర్లలో మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం..