English | Telugu
సుమను తప్పించి ఆ కుర్రహీరోను పెట్టారు..!
Updated : May 7, 2016
ఈ మధ్య కాలంలో పెద్ద స్టార్స్ కు ఆడియో ఫంక్షన్స్ కు యాంకరింగ్ అంటే సుమ అన్న పేరు మాత్రమే గుర్తొస్తుంది. కానీ బ్రహ్మోత్సవం ఆడియోకు మాత్రం సుమను పక్కన పెట్టేశారు. ఆమె యాంకరింగ్ బోర్ కొట్టించకపోయినా, ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్న ఫేస్ అయిపోయింది. అందుకే కాస్త ఫ్రెష్ గా ఆలోచించింది బ్రహ్మోత్సవం టీం. యాంకర్ గా మొన్న మొన్నే ఐఫా ఉత్సవంలో ఇరగ్గొట్టేసిన నవదీప్ ను ఆడియోకు యాంకర్ గా సెట్ చేశారు. మనోడు కూడా మంచి కామెడీ టైమింగ్ తో ఫంక్షన్ ఎక్కడా బోర్ కొట్టకుండా సరదాగా నడుపుకుంటూ వచ్చేశాడు. నిన్నే చందమామ సినిమా చూశాను. నిన్ను చాలా మిస్సవుతున్నాను కాజల్ అంటూ స్టేజ్ పైకి రాకుండా మైక్ లో మాట్లాడి, అయ్యో మైక్ ఆపలేదా అంటూ పైకి రావడం, హీరోయిన్స్ కు కొంటె సెటైర్లు వేయడం లాంటివన్నీ బాగానే క్లిక్కయ్యాయి. తనే ఒక హీరో అయ్యుండి మహేష్ బాబును ఏకధాటిగా పొగడటం కూడా జనానికి బాగా నచ్చింది. ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించకుండా, తన సమయస్ఫూర్తిగా బాగా లాక్కొచ్చాడు. అతని యాంకరింగ్ మూవీ టీం కి కావాలి సరే..మరి యాంకరింగ్ చేయాల్సిన అవసరం నవదీప్ కు ఏముందబ్బా..!