English | Telugu
ఆడియో ఫంక్షన్ కు మహేష్ డైరెక్టరా..?
Updated : May 7, 2016
హైదరాబాద్ లో మే 7 న జరిగిన బ్రహ్మోత్సవం పాటల వేడుక అంగరంగ వైభవంగా వేసిన సెట్ లో కలర్ ఫుల్ గా జరిగింది. ఫంక్షన్ కు హాజరైన సమంత, కాజల్, ప్రణీతలతో పాటు ఆడవాళ్లందరూ కూడా సంప్రదాయబద్ధంగా రావడం విశేషం. సాధారణంగా, ఆడియోకు హీరోలు లేటుగా వస్తుంటారు. కానీ బ్రహ్మోత్సవం ఆడియోకు మాత్రం మహేష్ ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అవ్వకముందే పంక్చువల్ హాజరయ్యారు. దాంతో కష్టపడి డ్యాన్స్ లు ప్రాక్టీస్ చేసిన వాళ్లందరికీ, డైరెక్ట్ గా మహేష్ ముందే పెర్ఫామ్ చేసే అవకాశం కలిగింది. దీంతో పాటు ఫంక్షన్లో ఇది వరకటికంటే చాలా యాక్టివ్ గా, అందరికీ సూచనలిస్తూ, నిర్మాత పివిపితో మాట్లాడుతూ మహేష్ చాలా బిజీగా కనిపించారు. ఆడియో ఫంక్షన్ ను ముందు తిరుపతిలో అనుకున్న సంగతి తెలిసిందే. తర్వాత సడెన్ గా జేఆర్సీ కన్వెన్షన్ కు మారింది. దీంతో కొత్త వెన్యూలో హడావిడి అంతా మహేష్ ప్లానింగ్ ప్రకారమే జరిగిందంటున్నారు సినీజనాలు. మొదటి సారి మహేష్ ఆడియో ఫంక్షన్ కు ఆయన కూతురు సితార వచ్చింది. లుక్స్ పరంగా చాలా గ్రాండ్ గా, స్పీచ్ ల ప్రకారం అందరూ చాలా సింపుల్ గా మాట్లాడటం విశేషం.