English | Telugu
సితార పాప వచ్చినందుకు మహేష్ ఫుల్ హ్యాపీ..!
Updated : May 7, 2016
మహేష్ బాబు సాధారణంగా ఆడియో ఫంక్షన్లలో చాలా సైలెంట్ గా ఉంటారు. పెద్ద హడావిడి ఉండదు. కానీ బ్రహ్మోత్సవం ఆడియో ఫంక్షన్లో మాత్రం, మహేష్ చాలా యాక్టివ్ గా కనబడ్డారు. స్టేజ్ పై మాట్లాడే సమయంలో కూడా ప్రతీసారి కంటే చాలా ఎక్స్ ప్రెసివ్ గా మాట్లాడారు. అందుక్కారణం ఆయన కూతురు సితారే నట. ఇన్నాళ్లూ మహేష్ తో పాటు గౌతమ్ వచ్చేవాడు తప్ప, సితారను బయటి ఫంక్షన్లకు మహేష్ తీసుకురాలేదు. కానీ మొదటిసారి సితార ఈ ఆడియో ఫంక్షన్ కు వచ్చింది. అందుకే మహేష్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడట. " ఈరోజు సితార పాప రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే తను వచ్చిన మొదటి ఆడియో ఫంక్షన్. అంతా మంచే జరుగుతుంది. " అంటూ మహేష్ తన స్పీచ్ ను మొదలెట్టారు. బ్రహ్మోత్సవం మే 20 న విడుదలకు సిద్ధమవుతోంది. పివిపి బ్యానర్లో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ స్వరాలందించాడు.