English | Telugu
అభిమానులందరూ నా గుండెల్లో ఉంటారు..!
Updated : May 7, 2016
ఈ రోజు జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో, బ్రహ్మోత్సవం ఆడియో వేడుక ఘనంగా జరిగింది. ఎప్పుడూ అభిమానుల గురించి పెద్దగా చెప్పని మహేష్ బ్రహ్మోత్సవం ఆడియోలో మాత్రం వాళ్లకు తియ్యటి మాట చెప్పారు. " నేనెప్పుడూ మీ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. మనకు ఎవరి మీదైనా ప్రేమ ఉంటే దాన్ని మాటల్లో చేయలేం. నాకు కూడా మీరంతా అంతే. స్టేజ్ మీద పెద్ద పెద్ద మాటలు చెప్పడం నాకు అలవాటు లేదు. కానీ ఒకటి మాత్రం చెబుతాను. నేను ఏ స్టేజ్ లో ఉన్నా దానికి కారణం మీరే. మీరంతా ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు. మే 20 నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. థియేటర్లో కలుసుకుందాం " అంటూ స్పీచ్ ను ముగించారు సూపర్ స్టార్ మహేష్.