English | Telugu
బ్రహ్మోత్సవం.. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ ఎవరు?
Updated : Apr 5, 2016
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బ్రహ్మోత్సవం. మామూలుగా సినిమాకి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ హీరోనే. మరి అమ్మాయిల కలల రాకుమారుడు, సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా యాక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా ఆయనే ఎట్రాక్షన్ అవుతారు. దీనిలో భాగంగా షూటింగ్ లోకేషన్‌లో కాజల్, సమంత, ప్రణీతలు మహేశ్‌తో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. అలాగే వాటిని తమ తమ అధికారిక సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్ చేశారు. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.
ఇప్పుడు మహేశ్‌ను పక్కకు నెట్టి ఒక చిన్నారి షూటింగ్ స్పాట్‌లో సెంటార్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యింది. ఆ చిన్నారి ఎవరో కాదు మహేశ్ గారాల పట్టి సితార. ఖాళీ సమయం దొరికితే మహేశ్‌తో ముచ్చట్లు చెప్పుకోవడానికి ఆ చిత్రంలోని వారంతా క్యూకట్టేవారు. కానీ ఇప్పుడు సీతార ఎంట్రి ఇచ్చాక సెట్‌లో ఉన్న వారంతా ఆ చిన్నారితో ఆడుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మొన్న సమంత, సితారతో దిగిన ఫోటోలు హల్‌చల్ చేయగా ఇప్పుడు సీనియర్ నటి రేవతితో కలిసి ఉన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అందరూ సితార చుట్టూ తిరుగుతూ తనను పట్టించుకోకపోవడంతో మహేశ్ కూడా కాస్తంత ఇరిటేషన్‌కు గురవుతున్నాడు. అయినా తన కూతురు తనకన్నా ఎక్కువ క్రేజ్ తెచ్చుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ప్రిన్స్.