English | Telugu
‘మనం’,‘సోగ్గాడే..’,‘ఊపిరి’ నాగ్ వాట్ నెక్ట్స్
Updated : Apr 5, 2016
అక్కినేని నాగార్జున..ప్రజంట్ లేటు వయసులో తన విశ్వరూపాన్ని చూపిస్తూ హ్యట్రిక్ సూపర్ హిట్లతో కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాడు. మనం, సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి చిత్రాలలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో ఇలాంటి సినిమాలు తను తప్ప ఎవరు చేయలేరని నిరూపించారు కింగ్. మరి వరుస సక్సెస్‌ల తర్వాత నాగ్ తర్వాతి సినిమా ఎంటీ? ఎవరితో చేస్తాడు? అందులో నాగ్ ఎలాంటి క్యారెక్టర్‌లో నటిస్తాడు? అనే క్వశ్చన్స్ అభిమానుల్ని చంపేస్తున్నాయి. అయితే తన తర్వాతి సినిమాలో నాగ్ భక్తుడిగా కనిపించనున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.
వరుస రోమాంటిక్ హిట్‌ల తర్వాత మన్మథుడిలోని అసలు సిసలు నటుణ్ని పరిచయం చేసిన సినిమా అన్నమయ్య. ఈ సినిమా సక్సెస్ తర్వాత యాక్షన్, రోమాంటిక్ మూవీస్‌కి మాత్రమే నాగ్ సెట్ అవుతాడు కాని ఇలాంటివి నాగ్ డీల్ చేయలేడు అంటూ ఇండస్ట్రీలోని చాలా మంది అనుమానించారు.. విమర్శించారు. కానీ వారి అభిప్రాయాలను వమ్ము చేస్తూ కింగ్ అన్నమయ్య, శ్రీరామదాసు పాత్రలను అద్భుతంగా పోషించి తండ్రి లాగే తాను కూడా భక్తుడి పాత్రల్లో మెప్పించగలనని నిరూపించారు.
ప్రజంట్ అదే జోనర్‌లో మరోసారి భక్తుడి గెటప్ వేయాలని డాన్ డిసైడయ్యాడంట. శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుడు హాథీరాం బాబా పాత్రలో నాగ్ నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. నాగార్జునతో అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి సినిమాలకు దర్శకత్వం వహించిన కె. రాఘవేంద్రరావే ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఈ విషయాన్ని నాగార్జున కాని రాఘవేంద్రరావు కాని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.