English | Telugu
విడాకులు తీసుకున్న ఆ హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకోబోతున్న సిద్ధార్థ్!
Updated : Jan 3, 2024
'బొమ్మరిల్లు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమాన కథానాయకుడుగా మారిన హీరో సిద్ధార్థ్. కొంత కాలం నుంచి సరైన సినిమాలు లేకపోయినా కూడా నేటికీ సిద్దార్ధ్ ని అభిమానించే వాళ్ళు చాలా మందే ఉన్నారు. రీసెంట్ గా 'చిన్నా' అనే సినిమాతో వచ్చి మంచి విజయాన్నే అందుకున్నాడు. తాజాగా సిద్దార్ధ్ కి సంబంధించిన న్యూస్ ఒకటి టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచింది.
సిద్దార్ధ్ కి 2003 లో మేఘన అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఆ తర్వాత 2007 లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు సిద్దార్ధ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు వినపడుతున్నాయి. ఇంతకీ సిద్దార్ధ్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ అదితిరావు హైదరీ. హిందీ, తెలుగు భాషల్లో పలు సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అదితిరావు గత కొంత కాలంగా సిద్దార్ధ్ తో ప్రేమలో ఉంది. అందుకు బలం చేకూరేలా ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో కూడా దర్శనం ఇచ్చాయి.
అలాగే మొన్న తన అభిమానులకి ఇన్ స్టాగ్రమ్ ద్వారా సిద్దార్ధ్, తను కలిసి ఉన్న పిక్ తో నూతన సంవత్సర శుభాకాంక్షలని చెప్పింది అదితి. ఈ సంవత్సరమే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని, త్వరలోనే డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అదితిరావు ,సిద్దార్ధ్ లు మహా సముద్రం అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. అదితరావుకి కూడా గతంలోనే పెళ్లి జరిగింది. ఆ తర్వాత భర్త నుంచి విడాకులు తీసుకుంది.