English | Telugu
భూమికను పట్టేసిన లడ్డుబాయ్
Updated : Sep 7, 2013
"అల్లరి" చిత్రంతో నరేష్ కు, "అనసూయ" చిత్రంతో భూమిక కు హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు రవిబాబు. అయితే "అనసూయ" చిత్రం తర్వాత రవిబాబు దర్శకత్వం వహించిన ఏ ఒక్క చిత్రం కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే అల్లరి నరేష్, భూమికలతో కలిసి "లడ్డు బాయ్"అనే చిత్రాన్ని తెరకేక్కిస్తున్నాడు దర్శకుడు రవిబాబు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రం ఈ ముగ్గురికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.