English | Telugu

మొత్తానికి లైన్‌ క్లియర్‌.. మరి అక్కడైనా జనం ఆదరిస్తారా! 

కమల్‌హాసన్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘భారతీయుడు’ అప్పట్లో ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘భారతీయుడు2’ అంత డిజాస్టర్‌ మూవీగా నిలిచింది. ఎన్నో అవాంతరాల నడుమ షూటింగ్‌ పూర్తి చేసుకొని రిలీజ్‌ అయిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. కమల్‌, శంకర్‌ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. సినిమా రిలీజ్‌ అయి ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకోవడంతో ఆలోచనలో పడిన నెట్‌ఫ్లిక్స్‌ యాజమాన్యం మొదట ఇచ్చిన ఆఫర్‌ను క్యాన్సిల్‌ చేసుకుందనే వార్తలు వచ్చాయి. అందుకే ఓటీటీలోకి వచ్చే డేట్‌ని కన్‌ఫర్మ్‌ చెయ్యలేకపోతున్నారని చెప్పుకున్నారు.

ఇప్పుడు ‘భారతీయుడు2’ చిత్రాన్ని స్ట్రీమింగ్‌ చెయ్యడానికి నెట్‌ఫ్లిక్స్‌ రెడీ అయిందని తెలుస్తోంది. తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఆగస్ట్‌ 9 నుంచి స్ట్రీమింగ్‌ కాబోతోంది. థియేటర్లలో ప్రేక్షకుల్ని నిరాశపరిచిన ఈ సినిమాకి ఓటీటీలో ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి. మేకింగ్‌ పరంగా, టేకింగ్‌ పరంగా ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని నిర్మించినప్పటికీ పాత కాన్సెప్ట్‌తోనే మళ్ళీ చెయ్యడం వల్ల ప్రేక్షకులు డిజప్పాయింట్‌ అయ్యారు. ఈ సినిమా మూడో భాగం ట్రైలర్‌ను సినిమా ఎండిరగ్‌ చూపించారు. ఆ సినిమా తప్పకుండా హిట్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్టు అందులోని విజువల్స్‌ చూస్తుంటే అర్థమవుతోంది.