English | Telugu

ట్రెయిలర్ కత్తిలా వుంటేనే.. సినిమా ఓపెనింగ్స్


సినిమా హిట్టా ఫట్టా అనేది విడుదలైన తర్వాత విషయం. ఇప్పడు సినిమా రూపకర్తలకు సినిమా కంటే ముందే మరో హిట్టు కొట్టాల్సిన ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తోంది. సినిమా ఫస్ట్‌లుక్, టీజర్, ట్రెయిలర్ ఇలా సినిమా ప్రమోషన్లో భాగంగా దశల వారిగా విడుదలలు వుంటాయి. ఇవన్ని కూడా సినిమా విడుదలకు ముందే పాజిటివ్ టాకు అందుకుంటేనే సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. కిక్ ట్రెయిలర్, హేట్ స్టోరీ 2 ప్రమోషనల్ వీడియోలు నెటిజన్లు మిలియన్లలో చూశారు. దీంతో సినిమాలకు పబ్లిసిటీ రావటమే కాకుండా విడుదలకు ముందే హిట్ టాకు కూడా మొదలైంది. కిక్ సినిమా అడ్వాన్స్ బుకింగ్లు భారీగా ఊపందుకోవటం దీనికి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఇప్పుడు ఆ తరహాలో బ్యాంగ్ బ్యాంగ్ సినిమా టీజర్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన ఒక్క రోజులోనే ఇరవై లక్షల మంది ఆ వీడియోని చూశారు. హృతిక్, కత్రీనా కలిసి నటిస్తున్న ఈ సినిమాకు కావలసినంత పబ్లిసిటీ ఆల్ రెడీ వచ్చిందనే చెప్పాలి. ఇక సినిమా విడుదలే తరువాయి. దీన్ని బట్టి చూస్తే సినిమా కంటే ముందు ట్రెయిలర్ హిట్టు సాధించడం ముఖ్యమని అర్థమవుతోంది.


అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.