English | Telugu

చిక్కుల్లో తమిళ 'దృశ్యం'


తెలుగులో రీసెంట్ హిట్ చిత్రం 'దృశ్యం' తమిళంలో రూపొందిచడానికి కమల్ హాసన్ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీదేవి కూడా నటించబోతోంది. కన్నడ, మలయాళంలో సూపర్ హిట్టయిన ఈ చిత్రం తమిళంలో రీమేక్ చేయడానికి మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. ఆగస్టు నుంచి షూటింగ్ మొదలు పెట్టాలనుకున్న ఈ సినిమాకు కోర్టు కష్టాలు ఎదురవుతున్నాయి.


'దృశ్యం' ఒరిజినల్ మలయాళ మాతృకలో తాను కొన్న జపాన్ చిత్ర సన్నివేశాలున్నాయంటూ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్ ఆరోపిస్తున్నారు. తను రైట్స్ కొన్న చిత్రంలోని సీన్లు ఇందులో కాపీ చేశారంటూ మలయాళ 'దృశ్యం' సినిమా రచయితకు, నిర్మాతకు లీగల్ నోటీసులు పంపారు. ఇక చిత్ర కథ తాను రాసిన 'ఒరు మజకళాటు' మలయాళ నవలలోనికి అని రచయిత సతీష్ పాల్ కూడా కోర్టుకెక్కారు. ఇందుకు స్పందించిన ఎర్నాకుళం కోర్టు తమిళ వెర్షన్ దృశ్యం షూటింగ్ నిలపివేయాలంటూ ఆదేశాలిచ్చింది.


అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.