English | Telugu
మహేష్-మురుగదాస్ సినిమాలో 'రష్మి' ?
Updated : Mar 2, 2016
జబర్దస్త్ భామ రష్మి దశ తిరిగిందా..చిన్న చిన్న పాత్రల సుంచి వెండి తెరపైకి అడుగుపెట్టిన రష్మి పాపకు ఇప్పుడు బంపర్ ఆఫర్ తగిలిందా..? అవునంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. రష్మి నటించిన గుంటూర్ టాకీస్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. కానీ ఈ లోపే ప్రిన్ మహేష్ - మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఇక ముఖ్యపాత్రకు రష్మి ఎంపికైందని లేటెస్ట్ టాక్. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీప్రొడక్షన్లో మురుగదాస్, బ్రహ్మోత్సవం ఫైనల్ స్టేజ్ లో మహేష్ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా, సినిమా కోసం క్యాస్టింగ్ ప్రారంభించిన మురుగ, ఒక ముఖ్య పాత్రకు రష్మి కరెక్ట్ గా సరిపోతుందని భావించాడట. మహేష్ పక్కన రోల్ అనగానే ఎగిరి గంతేసి మరీ రష్మీ ఒప్పేసుకుందట. ఈ వార్తల్లో ఎంత వరకూ నిజముందో తెలియదు కానీ, ఒకవేళ ఈ ఛాన్స్ దొరికితే మాత్రం, రష్మికి పండగే..