English | Telugu

బాలయ్య వందో సినిమాకోసమేనా ఈ మీసం..?

బాలకృష్ణ ఏ సినిమా చేసినా, అందుల్లో కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. అలాంటిది తన వందో సినిమాకోసం ఇంకెంత ఆలోచించి ఉంటారో అన్న అనుమానం ఫ్యాన్స్ కు కలగకమానదు. సింహా దగ్గర్నుంచి మొదలెట్టి, బాలయ్య తన మీసంలో బాగా వెరైటీని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మీసం డిఫరెంట్ గా ఉంచితే, ఆ సినిమా హిట్టేనని బాలయ్యకు గట్టి నమ్మకం. దాన్ని ప్రూవ్ చేస్తూ మీసం తిప్పిన బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, డిఫరెంట్ మీసకట్టును ఫాలో అయిన సింహా, లెజండ్ లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. ఇంతకూ బాలయ్య లేటెస్ట్ లుక్ మీరు చూశారా..?

తన మీసం నుంచే కొన్ని సినిమాలు పుట్టాయని బాలయ్య చెబుతుంటారు. తాజాగా క్రిష్ తో చేయబోయే వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి ఆల్ మోస్ట్ కన్ఫామ్ అని వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా కోసమే బాలయ్య ఇలా కొత్త మీసకట్టును పెంచబోతున్నారా..? చక్రవర్తి గెటప్ కు తన మీసంతో అందాన్ని జోడించబోతున్నారా..? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే, మరో కొద్ది రోజుల్లో బాలయ్య స్వయంగా ఎనౌన్స్ చేసేవరకూ ఆగాల్సిందే..లుక్కైతే అదిరింది మరి..ఏమంటారు..?

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.