English | Telugu

బాల‌య్యా.. ఇలా చేశావేంట‌య్యా?

బాల‌కృష్ణ వందో సినిమా దాదాపుగా క్రిష్‌తో ఖాయ‌మైపోయింది. ఒక‌ట్రెండు రోజుల్లో బాల‌కృష్ణ కాంపౌండ్ నుంచి వందో సినిమాకు సంబంధించిన ఆఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. ఈలోగా ఈ క‌థ గురించీ, త‌న పాత్ర గురించీ క్షుణ్ణంగా అధ్య‌యనం చేస్తున్నారు బాల‌కృష్ణ‌. అంతా బాగానే ఉంది. ఇలాంటి క‌థ వ‌చ్చినందుకు బాల‌య్య‌.... ఆయ‌న‌తో సినిమా తీసే అవ‌కాశం ద‌క్కినందుకు క్రిష్ తెగ సంతోష ప‌డిపోతున్నారు. కానీ.. వీళ్లిద్ద‌రి మ‌ధ్య‌లో బుక్క‌యిపోయింది కృష్ణ‌వంశీనే! ఆయ‌నేదో ఆయ‌న దారిలో రుద్రాక్ష అనే సినిమా తీసుకొందామ‌ని ప్ర‌య‌త్నాలు చేసుకొంటున్న త‌ర‌ణంలో బాల‌య్య నుంచి.. పిలుపొచ్చింది. `వందో సినిమా చేసిపెట్టు` అని బాలకృష్ణ స్వ‌యంగా నోరు తెర‌చి అడిగాడ‌ట‌. బాల‌య్య లాంటి స్టార్ హీరో.. పిలిచి వ‌రం ఇస్తే కాద‌నే వాళ్లు ఉంటారా?? అందుకే క్రిష్ణ‌వంశీ కూడా వెంట‌నే ప్రొసీడ్ అయిపోయాడు.

త‌న రుద్రాక్ష‌ని ప‌క్క‌న పెట్టి.. `రైతు` స్ర్కిప్టు ప‌నుల్లో ప‌డిపోయాడు. ఒక‌ట్రెండు సార్లు హిందూ పురం వెళ్లి బాల‌య్య కోసం అక్క‌డే మ‌కాం వేశాడు. క‌థ కూడా దాదాపుగా ఓకే అయిపోయింది. ఈ ద‌శ‌లో బాల‌య్య `సారీ` చెప్ప‌డంతో కృష్ణ‌వంశి పూర్తిగా నిరాశ‌లో కూరుకుపోయాడ‌ట‌. `నా మానాన నేను ప‌నిచేసుకొంటే.. ఎందుకు పిల‌వ‌డం, ఇప్పుడెందుకు సారీ చెప్ప‌డం` అంటూ.. తెగ ఇదైపోతున్నాడ‌ట‌. `ఇప్పుడు కాక‌పోయినా.. ఎప్పుడో ఒక‌ప్పుడు మ‌నం సినిమా చేద్దాం..` అని బాల‌య్య కృష్ణ‌వంశీకి మాట ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. అయితే కృష్ణ‌వంశీ మాత్రం.. అందుకు ఒప్పుకోలేద‌ట‌. వందో సినిమా అంటే.. ఆ ప్ర‌త్యేకత వేరు. 101 వ‌సినిమా చేసినా.. అంత క్రేజ్ ఉండ‌దు. అందుకే కృష్ణ‌వంశీ కూడా.. ఈ ప్ర‌పోజ‌ల్ ప‌ట్ల స‌ముఖ‌త చూపించ‌లేద‌ట‌. అలా... కృష్ణవంశీకి ఓ క్రేజీ ప్రాజెక్టు అందిన‌ట్టే అంది చేజారిపోయింది.. బ్యాడ్ ల‌క్ అంటే ఇదే.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.