English | Telugu

'ఖుషీ' సీక్వెల్లో హీరోయిన్ ఎవరు..?

సర్దార్ గబ్బర్ సింగ్ పనుల్లో బిజీబిజీగా ఉన్న పవన్, తన తర్వాతి సినిమాగా ఖుషీ సీక్వెల్ చేస్తున్నారని టాక్ ఫిల్మ్ నగర్లో ఉంది. ఖుషీ డైరెక్టర్ ఎస్.జే.సూర్య ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ను పక్కాకా ఫినిష్ చేశాడట. ఒకవేళ ఇది నిజమే అయితే, హీరోయిన్ గా ఎవర్ని తీసుకుంటారన్నదే మెయిన్ క్వశ్చన్. ఖుషీలో పవన్, భూమిక కాంబో మామూలుగా పేలలేదు. సినిమా అంతా ఆల్ మోస్ట్ ఇద్దరి భుజాల మీద నడుస్తుంది. వాళ్ల కెమిస్ట్రీ కూడా కేక పుట్టించింది.

దీంతో, ఖుషీ-2 లో హీరోయిన్ ఎవరైతే కరెక్ట్ గా ఉంటుందోనని గెస్ వర్క్స్ కూడా మొదలెట్టేశారు ఫ్యాన్స్. ఇప్పుడున్న హీరోయిన్స్ లో పవన్ తో ర్యాపోగా నటించిన వాళ్లు సమంత, తమన్నాలు మాత్రమే.. అత్తారింటికి దారేదిలో ఇద్దరి మధ్యా టీజింగ్ సీన్స్ ఒకప్పటి పవన్ సినిమాలను గుర్తు తెచ్చాయి. మరో వైపు తమన్నా కూడా, కెమేరామేన్ గంగతో సినిమాలో పవన్ పక్కన పెర్ఫామెన్స్ ఉతికి ఆరేసింది. ఈ ఇద్దరి కాంబినేషన్ కూడా బాగా వచ్చింది. ఈ ఇద్దరిలో పవన్ ఎవరిని సెలక్ట్ చేసుకుంటాడో లెట్స్ వెయిట్ అండ్ సీ..

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.