English | Telugu

సరైనోడు.. ఈ క‌థ ఎప్ప‌టిదండీ బాబూ..??

వెంకటేష్‌తో తుల‌సి చేసింత‌ర్వాత‌.... ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌నుకి కాస్త గ్యాప్ వ‌చ్చింది. ఆ టైమ్‌లో గోపీచంద్‌తో ఓ సినిమా చేయాల‌ని తెగ ప్ర‌య‌త్నించాడు శీను. ఆ కాంబినేష‌న్ ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. అయితే గోపీచంద్‌కి క‌థ న‌చ్చ‌క‌... బోయ‌పాటి సినిమాకి నో చెప్పేశాడు. ఆ క‌థ‌నే కొన్ని మార్పులు చేర్పుల‌తో... స‌రైనోడుగా చేసి, బ‌న్నీతో లాగించేస్తున్నాడ‌ట బోయ‌పాటి శ్రీ‌ను. అంటే.. ఈ క‌థ ఎప్ప‌టిదో ఆలోచించండి మ‌రి!

ఓ లేడీ ఎమ్మెల్యే... ఆమెకో బాడీ గార్డు.. వాళ్లిద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ - ఇలా న‌డుస్తుంద‌ట స‌రైనోడు స్టోరీ. ఈ లైన్ చూస్తుంటే మ‌న‌కు అంగ ర‌క్ష‌కుడు, బాడీ గార్డ్ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. ఇంచుమించు స‌రైనోడు కూడా ఇలానే న‌డుస్తుంద‌ట‌. క‌థ‌ల విష‌యంలో కొత్త‌గా ఆలోచించ‌క‌పోవ‌డ‌మే బెట‌ర్ అని... మ‌న ద‌ర్శ‌కులు ఎప్పుడో ఫిక్స‌యిపోయారు. బోయ‌పాటి శ్రీ‌ను కూడా అంతే. టేకింగు, ఫైటింగుల‌పై దృష్టి పెట్టే శ్రీ‌ను.. ఎప్పుడూ కొత్త క‌థ ఎంచుకోలేదు. ఈసారీ పాత చింత‌కాయ్ ప‌చ్చ‌డి లాంటి క‌థ‌కు త‌న‌దైన శైలిలో తాలింపు వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. మ‌రి ఈ వంట‌కం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.