English | Telugu
సింహ పక్కన సీతమ్మ?
Updated : Aug 12, 2013
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేసుకున్నారు అనే అంశం పై రోజుకో వార్త షికారు చేస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రంతో సీత పాత్రలో అందరిని అలరించిన అంజలిని కధానాయికగా తీసుకున్నట్లు వార్తలు. ఇద్దరు కధానాయికలు కావాల్సిన ఈ సినిమాకు ఇప్పటికే సోనాల్ చౌహాన్ ని ఒక హీరోయిన్ గా తీసుకున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై బాలయ్య చాలా నమ్మకంగా ఉన్నాడు. మరి ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.