English | Telugu
రెండు పెళ్ళిళ్ళతో బాలయ్య బిజీ
Updated : Aug 3, 2013
ఓ వైపు తన చిన్న కూతురు తేజస్విని పెళ్లి నిశ్చయ వేడుకలో పాల్గొంటూనే, మరోవైపు తన సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు నందమూరి బాలకృష్ణ.
బాలకృష్ణ తన రెండవ కూతురు తేజస్విని వివాహ పనులలో బిజీగా ఉన్నాడు. బాలయ్య ఇంట్లో ఇప్పటికే పెళ్లి వాతావరణం మొదలయ్యింది. దీంతో బాలయ్య కూడా క్షణం తీరిక లేకుండా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగని సినిమా షూటింగ్ కు మాత్రం బ్రేక్ ఇవ్వలేదు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓ పెళ్లి పాటను తెరకెక్కిస్తున్నారు. బృంద మాస్టర్ నేతృత్వంలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం కోటి రూపాయల వ్యయంతో ఓ భారీ సెట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించారు.
అయితే ఈ విధంగా బాలకృష్ణ అటు రియల్ లైఫ్ లోను, ఇటు రీల్ లైఫ్ లోను కూడా పెళ్లి సందడితో హుషారుగా ఉన్నారు.