English | Telugu
"బాహుబలి" ఇన్ చైనా..?
Updated : Aug 3, 2013
ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం "బాహుబలి". రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "ఈగ" చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రం ఇక్కడే కాకుండా చైనీస్ చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడి, అక్కడ కూడా మంచి టాక్ ను సంపాదించుకుంది. అయితే రాజమౌళి తెరకెక్కిస్తున్న "బాహుబలి" చిత్రాన్ని కూడా చైనీస్ భాషలోకి డబ్ చేసి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. మరి ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రానికి అప్పుడే చైనీస్ కు సంభందించిన డబ్బింగ్ రైట్స్ కూడా భారీ మొత్తంలో అమ్ముడు పోయాయని తెలిసింది. మరి ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.