English | Telugu
హైదరాబాద్ కు రానున్న బాహుబలి
Updated : Aug 5, 2013
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "బాహుబలి". ప్రభాస్,రానా,అనుష్క ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రంలో సుదీప్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కర్నూల్ లో వర్షం అడ్డంకి కారణంగా మొదటి షెడ్యుల్ ను ముందుగానే ముగించేసిన రాజమౌళి, రెండో షెడ్యుల్ కి ప్లాన్ చేస్తున్నాడు. రెండో షెడ్యుల్ ను హైదరాబాద్ లో కీలక సన్నివేశాలను ఆగస్టు రెండో వారంలో చిత్రీకరించానున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం... అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయ్యేలా ఉందని ఫిల్మ్ నగర్ టాక్. మరి ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.