English | Telugu
బాహుబలి ప్రభాస్ భుజానికి సర్జరీ
Updated : May 19, 2014
ప్రభాస్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘బాహుబలి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నెల రోజుల క్రితం ప్రభాస్‌కు శస్త్ర చికిత్స జరిగింది. దీని గురించి ఆయన ఫేస్ బుక్ లో వివరిస్తూ - ‘‘ ఎప్పుడో చేయించుకోవాలసిన చిన్నపాటి ఆపరేషన్ నెలరోజుల క్రితం చేయించుకున్నాను. భుజానికి సంబంధించిన ఈ ఆపరేషన్ ఎప్పటి నుంచో వాయిదా వేస్తు వచ్చాను. ఇంకా వాయిదా వేస్తే మంచిది కాదనిపించి, చేయించుకున్నాను. ఆపరేషన్ జరిగి నెలరోజులైంది. కాబట్టి, తేరుకున్నాను. మరో నెలలోపు షూటింగ్‌లో కూడా పాల్గొంటాను’’ అని తెలిపారు ప్రభాస్.
ప్రభాస్ బాహుబలి షూటింగ్ లోకేషన్లో అనారోగ్యానికి లోనయ్యాడని, కోమాలోకి వెళ్లిపోయాడనీ కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చాయి. అప్పుడు అభిమానులు ఆందోళన చెందకూడదని తాను బాగానే ఉన్నాడంటూ ఫేస్ బుక్ ద్వారా ప్రకటించాడు ప్రభాస్.