English | Telugu
డిస్ట్రిబ్యూటర్ల దాడి.. పూరి డ్రామా ఆడాడంట..?
Updated : Apr 18, 2016
సంచలనం కలిగించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్‌పై దాడి కేసు కీలకమైన మలుపు తిరిగింది. దాడి చేశారని చెప్పబడుతున్న డిస్ట్రీబ్యూటర్లు అభిషేక్, సుధీర్, రాందాస్‌లు ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. తాము పూరిపై ఎలాంటి దాడి చేయలేదని, అదంతా అవాస్తవమని అన్నారు.
పూరి జగన్ ఇంట్లో, ఆఫీసులో ఒక చీఫ్ మినిస్టర్ ఇంటికంటే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. బయట గన్‌మెన్లు, సెక్యూరిటీ, బౌన్సర్లు అంతా హడావుడిగా ఉంటుంది. ఇదంతా దాటుకుని తాము దాడి చేశామనడం సరికాదు. ఒక వేళ ఎటాక్ చేసుంటే సీసీటీవీ ఫుటేజీ ఉంటుందిగా..అది చూపించమనండి. లోఫర్ సినిమాతో నష్టాలు వచ్చిన మాట నిజమే..ఈ విషయంపై నిర్మాత సి.కళ్యాణ్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. కాని పూరి ఇలా కేసులతో తమని బెదిరించడం న్యాయం కాదని వారన్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా దాడి చేశారంటున్న ముత్యాల రాందాస్ ఒక హ్యాండీ కాపెడ్. మరి ఈ వాదనను పూరి ఎలా ఎదుర్కోంటారు. పూరి దగ్గర ఆధారాలు ఉన్నాయా? లేక తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నమా? అసలు పూరి ఇదంతా ఎందుకు చేసినట్టు ? తేలియాలంటే ఆయన నోరు విప్పాల్సిందే.