English | Telugu
వర్మ టీనేజ్‌లో ఇలా ఉండే వాడు..
Updated : Apr 18, 2016
రామ్ గోపాల్ వర్మ..ఈ పేరు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్..వివాదాలకు బ్రాండ్. తన టేకింగ్ స్టైల్‌తో భారతీయ సినిమాను మలుపు తిప్పిన క్రియేటర్. డిటెక్షన్ సినిమా తీసినా, మాఫియాపై మూవీ తీసినా , హార్రర్, రోమాన్స్ ఇలా ఏది చేసినా ఆయనకే చెల్లింది. వర్మ టాలెంట్‌కు ఎన్నో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ క్యూ కట్టాయి. కాంట్రవర్సీలతో పబ్లిసిటీ చేసి సినిమాను హిట్ చేసే ఫార్మూలాకు పితామహుడు ఆర్‌జీవీ. నిత్యం ఏదో ఒక అంశంపై..ఎవరో ఒక వ్యక్తిపై సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలుస్తారు వర్మ. ప్రస్తుతం విజయవాడకు చెందిన వంగవీటి మోహన రంగా జీవిత కథతో వంగవీటి తీస్తున్నారు. దర్శకుణ్ని హీరోని చేసిన ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. వర్మ వీరాభిమాని ఒకరు ఆయన బర్త్‌డే కానుకగా అలాంటి వారి కోసం ఆయన చిన్పప్పటి నుంచి దర్శకుడయ్యే వరకు తీయించుకున్న కొన్ని ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అవి మీ కోసం.