English | Telugu
దేవిని తొక్కెస్తున్న చిరంజీవి, బాలకృష్ణ..!
Updated : Apr 18, 2016
దేవిశ్రీప్రసాద్..డీఎస్పీ పేరు ఎదైనా సంగీత ప్రపంచంలో ఆ పేరు ఒక సంచలనం. వరుస మ్యూజికల్ హిట్స్‌తో అభిమానుల చేత స్టెప్పులు వేయించాడు దేవి. మనోడి టాలెంట్ తమిళ తంభిలకు నచ్చడంతో అక్కడ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చి..టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఒకేసారి బ్యాండ్ బజాయించాడు. అయితే అర్నెల్ల కిందట కుమారి 21 ఎఫ్ సక్సెస్ మీట్‌లో ఉన్నట్లుండి దేవిశ్రీ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని బాంబు పేల్చాడు నిర్మాత దిల్‌రాజు. సుకుమార్ దర్శకత్వంలో తన బేనర్లోనే దేవిని హీరోగా పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వాత సుక్కు..దేవి కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. కానీ రోజులు గడుస్తున్న కొద్ది ఈ వార్త కనుమరుగైపోయింది. ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు.
మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకున్న కమిట్మెంట్ల వల్లే సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు దేవి. చిరంజీవి 150వ సినిమాతో పాటు బాలయ్య వందో సినిమాకు కూడా తానే పనిచేయాల్సి ఉందని..రెండు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్‌లపైనే ఫుల్ ఫోకస్ పెట్టడంతో తనకు వాటితోనే టైం గడిచిపోతుందని. ఈ రెండు సినిమాల పని పూర్తయ్యాకా హీరోగా తన అరంగేట్రం గురించి ఆలోచిస్తానన్నాడు. ఈ పరిణామాలన్నింటితో దేవిని తెర వెనుక నుంచి తెర ముందు చూడాలనుకుంటున్న అభిమానులు నిరాశలో పడిపోయారు.