English | Telugu

సీతమ్మ వారికే ఫిక్స్ అవుతుందా?

"సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" చిత్రం ఏ క్షణంలో ఒప్పుకుందో కానీ, ఆ క్షణం నుండి హీరోయిన్ అంజలికి తెలుగులో అన్నీ అలాంటి హీరోల చిత్రాల అవకాశాలు వస్తున్నాయి. ఈ చిత్రంలో వెంకటేష్ వంటి అగ్ర హీరోతో నటించే సరికి కుర్ర హీరోలు అంజలిని తమ సినిమాలో తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు.

తాజాగా రవితేజతో కలిసి "బలుపు" చిత్రంలో నటించింది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. అదే విధంగా వెంకటేష్-రామ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న "గోల్ మాల్" చిత్రంలో వెంకటేష్ సరసన నటిస్తుంది. ఈ విధంగా వరుస అగ్ర హీరోల సినిమాలలో నటిస్తున్న అంజలిని, తమ చిత్రంలో హీరోయిన్ గా తీసుకుంటే తమ కెరీర్ కు ప్రాబ్లం వస్తుందేమోనని కుర్ర హీరోలు ఆలోచిస్తున్నారు. మరి ఇంతకి ఈ అమ్మడి ఆలోచన ఎలా ఉందో?