English | Telugu
బాబాయ్ తో వద్దంది..అబ్బాయితో సై అంటుందా..?
Updated : Feb 29, 2016
యాంకర్ అనసూయకు టాలీవుడ్ జనాల్లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ సోగ్గాడే చిన్ని నాయన తర్వాత రెట్టింపైంది. తాజాగా, ఇదే క్రేజ్ తో రామ్ చరణ్ ఒరువన్ రీమేక్ లో, ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వస్తున్నాయి. ఐటెం సాంగ్ తో పాటు, ఈ పాత్ర సినిమాలో కూడా కాసేపు హల్ చల్ చేస్తుందట. ఇన్నాళ్లూ ఐటెం సాంగ్స్ చేయను అని మడికట్టుకుని కూర్చున్న అనసూయ ఇన్నాళ్లకు మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఆఫర్ గనుక వచ్చినట్లైతే మాత్రం అనసూయ దశ తిరిగినట్లే. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలో సాంగ్ కు అనసూయ ఒప్పుకోలేదని పుకార్లు వచ్చాయి. మరి ఇప్పుడు అబ్బాయితోనైనా ఒప్పుకున్నట్లేనా..? చూద్దాం