English | Telugu
మహేష్ కు గౌతమ్ కు మధ్య కుదిరేనా..?
Updated : Feb 29, 2016
డైరెక్టర్స్ కు హాట్ కేక్ లాంటి నటుడు మహేష్ బాబు. ఆయనతో సినిమా చేయాలని ప్రతీ దర్శకుడూ ఉవ్విళ్లూరుతుంటాడు. అందుకే సినిమా తర్వాత సినిమా వరసగా మహేష్ కు ఆఫర్లు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం బ్రహ్మోత్సవం, తర్వాత మురుగదాస్, ఆ వెనుకే పూరీ కాచుకుని కూర్చున్నారు. ఆ తర్వాత కూడా చాలా మంది దర్శకులే లైన్లో ఉన్నారు. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి గౌతం మీనన్ పేరు చేరింది. స్వయంగా అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తానని ప్రకటించారు. 2017 సమ్మర్ కానుకగా సినిమాను రిలీజ్ చేస్తామని ఆయన చెబుతున్నారు. మహేష్ ఒకసారి ఒక సినిమా మాత్రమే షూట్ చేస్తున్న నేపథ్యంలో, అశ్వనీదత్ ఎంత మేరకు ఆ డేట్ లోపే రిలీజ్ చేస్తారు అనేది మాత్రం ప్రశ్నగా మారింది. ఇప్పటికే చాలా సార్లు మహేష్-గౌతం మీనన్ కాంబినేషన్ గురించి వార్తలు వచ్చాయి. కానీ అవి పుకార్లుగానే ఉండిపోయాయి. మరి ఈ సారైనా వీరిద్దరి కాంబినేషన్ నిజమవుతుందేమో చూడాలి.