English | Telugu

ఆస్కార్ కోసం టైటానిక్ హీరో తిప్పలు.!

లియోనార్డో డీ కాప్రియో..మనకు టైటానిక్ హీరోగా మాత్రమే తెలుసు. కానీ హాలీవుడ్ కు మాత్రం, లియో ఆస్కార్ అందని అభాగ్యుడు. పదే పదే ఆస్కార్ మీద తన నటనతో సినిమాలతో దండయాత్ర చేసినా లియోకు ఆస్కార్ దక్కలేదు. కానీ ఎట్టకేలకు, 2016లో ది రెవనెంట్ సినిమాకు ఆస్కార్ గెలుచుకున్నాడు లియోనార్డో. అతనికి అవార్డ్ ప్రకటించగానే, మొత్తం సభ అంతా లేచి, స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. అసలు ఇంతకీ, లియోకు ఆస్కార్ రావడం గురించి ఎందుకంత చర్చ..? ఈ ప్రశ్నకు సమాధానం పెద్దదే. లియోనార్డో ఆస్కార్ కోసం ఏమేం చేయాలో అన్నీ చేశాడు. ఒకానొక సమయంలో ఆస్కార్ కోసం సినిమాల్లో లియో తనను తాను గాయపరుచుకునేంతగా ఇన్వాల్వ్ అయిపోతాడేమోనని భయపడ్డారు హాలీవుడ్ సినీజనాలు. అంత డెడికేషన్ ప్యాషన్ తో పనిచేసే లియో ఎట్టకేలకు ఒక ఆస్కార్ వాడయ్యాడు..ఇంతకీ, ఇప్పటి వరకూ తన సినిమాల్లో, లియో ఏమేం చేశాడో తెలుసా..!!

ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ సినిమాలో లియో పాత్ర పేరు జోర్డాన్ బెల్ఫోర్ట్. అనుకోకుండా మత్తుమందుల్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల, అతని శరీరం సగం చచ్చుబడిపోతుంది. ఈ సీన్ పెర్ ఫెక్ట్ గా రావడం కోసం వారం రోజుల పాటు, రోజూ షూటింగ్ లో నేలమీద పాకేవాడు లియోనార్డో. దీని ప్రభావం వలన ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత, నడుము నెప్పితో, కొన్ని నెలల పాటు మంచం దిగలేకపోయాడు. నడుము నొప్పి వచ్చింది తప్ప ఆస్కార్ రాలేదు

జాంగో అన్ చైన్డ్ లో, కోపంలో లియో టేబుల్ ను గుద్దే సన్నివేశంలో, అక్కడున్న గాజు గ్లాస్ మీద గుద్దాడు. చెయి లోతుకు తెగిపోయి, చాలా రక్తం పోయింది.కానీ షాట్ పూర్తయ్యేవరకూ, లియో మాట్లాడలేదు. రక్తం పోయింది కానీ ఆస్కార్ రాలేదు.

ప్రతీ రోజూ ఏడు గంటల పాటు మేకప్ లో కూర్చోవడం చాలా కష్టం. జె.ఎడ్గర్ సినిమా కోసం గుండు చేయించుకుని, తల మీద సిలికాన్ కాప్ పెట్టి, ఒక్కో వెంట్రుకను లియో తలపై పేర్చారు. ముసలి వాడిగా తనను తాను చూపించడం కోసం లియో పడిన కష్టం అది. ఆఖరికి ముక్కు రంధ్రాలు కూడా వేరుగా కనిపించాలని, వాటిలో సర్కులర్ ఆగ్ మెంటేటర్ ను పెట్టించుకున్నాడు. వయసు మళ్లిన పాత్రలో లావుగా కనిపించడం కోసం, వందలాది కేకులు తిని, బరువు పెరిగాడు. కానీ ఆస్కార్ మాత్రం దక్కలేదు.

షట్టర్ ఐలాండ్ అనే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీలో హీరో మెంటల్ హాస్పిటల్లో ఒంటరిగా గడపాలి..అందుకోసం నిజంగానే ఒక మెంటల్ హాస్పిటల్లో గడిపాడు. అక్కడ ఉన్న ఒక్కోరోజు ఒక్కో యుగంలా గడిచినా, చివరికి అదంతా సినిమా కోసం కాబట్టి, నరకాన్ని భరించాడు. ఈసారి కూడా ఆస్కార్ ను ముట్టుకోలేకపోయాడు.

ది ఏవియేటర్ సినిమాలో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉన్న వ్యక్తిగా యాక్ట్ చేయడం కోసం, నిజంగా ఓసీడీ ఉన్న వ్యక్తితో కలిసి జీవించాడు. కలిసి తింటూ, కలిసి ఉంటూ, కలిసి పడుకుంటూ, ఆ లక్షణాలున్న వ్యక్తి జీవితాన్ని, మ్యానరిజాన్ని దగ్గర్నించి చూడటం కోసం లియో చేసిన పని అది. మరి ఆస్కార్..ఊహూ..ఆ ఊసే లేదు.

ఇక ఇప్పుడు ఆస్కార్ తెచ్చిన ది రెవనెంట్ లో కూడా ఇలాంటివి చాలానే చేశాడు. ఒక సీన్లో పచ్చి మాంసం తిన్నాడు. మరొక సీన్లో నిజమైన గుర్రం కళేబరంలో పడుకున్నాడు. మంచులో చిక్కుకున్న వ్యక్తి ఎంత నరకం చూస్తాడో, అంతటినీ స్వయంగా అనుభవించాడు. ఈసారి మాత్రం అతని కష్టాన్ని ఆస్కార్ తక్కువ చేయలేకపోయింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, లియో చేతికి చిక్కింది.

కేవలం ఇవే కాదు. నటన కోసం లియో చేసిన పనులకు లెక్కేలేదు. బ్లడ్ డైమండ్ సినిమా కోసం కిరాయి హంతకులతో కాలం గడిపినా, జె.ఎడ్గర్ సినిమా కోసం మొత్తం రెమ్యునరేషన్ కట్ చేసినా లియోకే చెల్లింది. తన పాతికేళ్ల కెరీర్లో 41 ఏళ్ల లియో నాలుగు సార్లు ఆస్కార్ గుమ్మం తొక్కాడు. కానీ అడుగు పెట్టలేకపోయాడు. 2016 మాత్రం లియోను నిరాశపరచలేదు. అతని జీవితకాలపు ఆనందాన్ని ఒక్క అవార్డు రూపంలో అందించింది. ఇన్నాళ్లూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో, లియోకు ఆస్కార్ రాకపోవడం మీద జోకులు వేస్తూ మెమెలు షేర్ చేస్తుండేవారు నెటిజన్లు. ఇక నుంచీ వాటికి స్కోప్ లేదు. అవును. లియోనార్డో డీకాప్రియో దగ్గర ఇప్పుడు ఆస్కార్ ఉంది..! అతను కూడా సాధించాడు..! ఇక నుంచీ ఎలాగూ రావు కాబట్టి, కొన్ని మెమెలు మీకోసం..

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.