English | Telugu
తాగి దొరికేసిన రాజశేఖర్!
Updated : Mar 14, 2015
రాజశేఖర్ అంటే.. యాంగ్రీ యంగ్ మెన్ అనుకొందురు... ఈయన అమ్మ రాజశేఖర్. డాన్సింగులు, డైరెక్షింగులూ చేస్తుంటాడు కదా.. ఆయన. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అడ్డంగా బుక్కయిపోయాడు. ఈమధ్య సినీ సెలబ్రెటీలను పోలీసులు వదలట్లేదు. పోనీలే పాపం అని వదిలేయడం లేదు. మొన్నటికి మొన్న రచయిత మచ్చ రవి కూడా ఇలానే దొరికేశాడు. ఆ తరవాత ఆయన డ్రైవింగ్ లైసెన్స్ రద్దయింది. ఇప్పుడు అమ్మరాజశేఖర్ వంతు వచ్చింది. శుక్రవారం రాత్రి తప్పతాగి.. కారు డ్రైవ్ చేసుకొంటూ జూబ్లీహిల్స్ దగ్గర పోలీసులకు దొరికిపోయాడు. ఆ సమయంలో కార్లో రాజశేఖర్ తో పాటు కుటుంబ సభ్యులున్నారు. పోలీసులు కారు సీజ్ చేశారు.. అమ్మ రాజశేఖర్‌పై కేసు నమోదు చేశారు. అసలే ఆయన కెరీర్ అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు పరువూ పోయింది.