English | Telugu
బన్నీ త్యాగం చేశాడా??
Updated : Mar 14, 2015
అటు రేయ్ - ఇటు సన్నాఫ్ కృష్ణమూర్తి.. వారం రోజుల వ్యవధిలో రెండు మెగా సినిమాలొస్తున్నాయంటే మెగా అభిమానులకు పండగే. అయితే.. సన్నాఫ్ సత్యమూర్తి కాస్త వైవిఎస్ చౌదరి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈనెల 27న రేయ్ వస్తుంది. ఏప్రిల్ 2...బన్నీ సినిమాకి ముహూర్తం ఫిక్సయ్యింది. నిజంగా ముందు అనుకొన్నట్టు బన్నీ సినిమా వస్తే రేయ్‌కి దెబ్బడిపోతుంది. ఈ విషయమై వైవిఎస్ చౌదరి బన్నీని సంప్రదించాడట. ``మీ సినిమా మరో వారం రోజులు ఆగితే.. రేయ్ గట్టెక్కుతుంది.. ప్లీజ్`` అంటూ అభ్యర్థించాడట. దాంతో బన్నీ కాస్త సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. సన్నాఫ్ సత్యమూర్తి ని ఏప్రిల్ 8 వ తేదీన తీసుకురావడానికి ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది. ఆరోజు బన్నీ పుట్టిన రోజు కూడా. అందుకే సెంటిమెంట్ పరంగా తనకూ కలిసివస్తుందని బన్నీ నమ్ముతున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి వాయిదాపడడం నిజమైతే.. వైవిఎస్ చౌదరి `రేయ్`తో పండగ చేసుకోవడం ఖాయం. మొత్తానికి రేయ్ కోసం... బన్నీ తన సినిమాని త్యాగం చేసినట్టే లెక్క.