English | Telugu
స్టూడియోలో దొంగలు పడ్డారు
Updated : Mar 14, 2015
సెలబ్రెటీల ఇళ్లలో, స్టూడియోలో దొంగలు పడుతున్నారు. పూరి ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన ఇంట్లో దాదాపు రూ.15 లక్షల విలువైన వస్తువులు మాయం అయ్యాయి. ఇప్పుడు అలాంటిదే మరో ఘటన. జూబ్లీహిల్స్‌లోని రామానాయుడు స్టూడియోలో దొంగలు పడ్డారు. విలువైన షూటింగ్ సామాగ్రి మాయమైంది. దాని విలువ దాదాపు రూ.60 లక్షల వరకూ ఉంటుందని సమాచారమ్. వెంటనే విషయాన్ని జూబ్లిహిల్స్ పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. ఈ స్టూడియోలో పని చేస్తున్న నలుగురు వర్కర్లు కలసి... పథకం ప్రకారం రోజూ కొన్ని వస్తువులు మాయం చేస్తూ వచ్చారు. చివరికి దొరికి పోయారు. నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.