English | Telugu

సర్దార్ ఆడియోకు నాగబాబు ఎందుకు అటెండ్ అవలేదు

సర్దార్ ఆడియో ఫంక్షన్. చాలా కాలం తర్వాత అన్నదమ్ముల్ని కలిసి ఒకే స్టేజ్ పై చూడబోతున్నామని మెగా ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఖుష్. కానీ మెగాబ్రదర్స్ అంటే నాగబాబు కూడా కలిస్తేనే పూర్తవుతారు. మరి సర్దార్ ఆడియోలో నాగబాబు ఎందుకు కనిపించలేదు. నాగబాబుకు పవన్ అంటే చాలా ఇష్టం. ఆరెంజ్ టైంలో పవన్ తన తరపున ఒక స్తంభంలా నిలబడి ఒడ్డెక్కించాడని కూడా నాగబాబు చాలా సార్లే చెప్పారు. మరి అంత ఇష్టమైన ఈ బ్రదర్స్ ఇద్దరూ కూడా స్టేజ్ మీద కలిస్తే ఎంత బాగుండేది అని అనుకోని మెగాఫ్యాన్ ఉండడు. మరి టవర్ స్టార్ ఎందుకు రాలేదు..? ఆయన్ను పిలవలేదా లేక ఆయనే రాలేదా..? చిరు బర్త్ డే వేడుకల్లో నాగబాబు ఫైరింగ్ దూరం పెంచిందా..? ఇదే ప్రశ్న అభిమానుల మదిలో ఉంది.

పైపెచ్చు మెగా కుర్ర హీరోలందరిదీ కూడా ఇదే పరిస్థితి. ఈ హీరోలందరూ తమ ఆడియో ఫంక్షన్లో ఒక్కసారైనా పవన్ ను తలచుకుంటారు. వాళ్లెవరూ ఆడియోకు అటెండ్ కాలేదు. వరుణ్ గానీ, ధరమ్ తేజ్ గానీ ఆడియో ఫంక్షన్ తర్వాత ట్విట్లర్లో ఆడియో గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ కూడా సేమ్ సిట్యువేషన్. మెగా కుర్రహీరోల్లో ఓన్లీ రామ్ చరణ్ మాత్రమే తన ఫేస్ బుక్ లో సర్దార్ ఆడియో ఫంక్షన్ గురించి పోస్ట్ చేశాడు. పవన్ అన్నట్టు, ప్రతీసారీ వాళ్ల ఫ్యామిలీ మధ్య అనుబంధాన్ని బయటికి ప్రూవ్ చేసుకోవాల్సి అవసరం లేదు. కానీ నాగబాబు వచ్చి ఉంటే, ఆడియో ఫంక్షన్ మరింత పరిపూర్ణమై ఉండేది కదా అనేది మెగాభిమానుల ఆశ అంతే.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.