English | Telugu
అల్లు శిరీష్ ట్విట్టర్ కాంట్రొవర్సీ
Updated : Apr 9, 2011
దీని మీద యన్ టి ఆర్ అభిమానులను స్పందన కోరగా "కండలుంటేనే కత్తి పట్టాలంటే అతని చిన మామయ్య పవన్ కళ్యాణ్ కి
యన్ టి ఆర్ "శక్తి" ఖర్మకాలి దిక్కుమాలిన డైరెక్టర్ వల్ల ఫ్లాపయ్యింది. అదే "శక్తి" గనక హిట్టయ్యుంటే అల్లు శిరీష్ ఈ కామెంట్ విత్ ఫొటోస్ పోస్ట్ చేసి ఉండేవాడా...? "శక్తి" సినిమా ఫ్లాపవ్వొచ్చు. కానీ నటుడిగా, ఒక హీరోగా అతని స్థాయి ఎన్నడూ ఫ్లాప్ కాదు. అతని ప్రతిభ గురించి ఆంధ్రప్రదేశ్ అంతటా అందరీకీ తెలుసు. ఈ రోజు కొత్తగా అతని ప్రతిభ గురించి చెప్పాల్సిందేం లేదు. హీరోలన్నాక హిట్లు ఉంటాయి...ఫ్జ్లాపులూ ఉంటాయి...అంత మాత్రం చేత ఆ హీరో పనికి రాడనుకుంటే మృగరాజు, కొమరంపులి, వరుడు, ఆరెంజ్ సినిమాల గురించి ఏమనాలి.
అయినా యన్ టి ఆర్ అంత గొప్పగా అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ డైలాగ్ చెప్పగలరా...? వాళ్ళకి స్పష్టమైన తెలుగే రాదు. వాల్లు, వీల్లు అంటారే గానీ వాళ్ళు, వీళ్ళు అని ఏనాడైనా స్పష్టంగా డైలాగ్ చెప్పారా...? కనీసం చెప్పగలరా...? ఇక డ్యాన్సులు, ఫైట్లూ అంటే మా యన్ టి ఆర్ కంటే వాళ్ళిద్దరూ మొనగాళ్ళా...? అనవసరంగా ఒక హీరో మీద ఇలా చీప్ కామెంట్లు...సూటి పోటీ మాటలూ ఆడంగిలా మాట్లాడకూడదు. మా హీరో మీద ఉన్న గౌరవంతో అల్లు శిరీష్ ని ఇంతటితో వదిలేస్తున్నాం.లేదంటే నందమూరి అభిమానుల దమ్మెంతో చూడాలనుకుంటే కమాన్ రమ్మనండి. మేము రెడీ" అని రెచ్చిపోయి అంటున్నారు. మరి దీనికి అల్లు శిరీష్ ఏమంటారో...? ఎలా స్పందిస్తారో...?