English | Telugu
ప్రభాస్ దారిలో బన్నీ.. బాలీవుడ్ డైరెక్టర్‌కి షాక్
Updated : Aug 8, 2023
పుష్ప ది రైజ్ చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో ఇమేజ్‌ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ఇప్పటికే పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలోనూ ఓ సినిమా ఉంటుంది. బాలీవుడ్ మేకర్స్ అల్లు అర్జున్‌తో సినిమాలు చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ బన్నీని కలిసి ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ సినిమా కథను నెరేట్ చేశారు. ముందు అల్లు అర్జున్ సైతం ఆ కథను చేయటానికి ఆసక్తిని చూపించారు. కానీ ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ని బన్నీ పక్కన పెట్టేశారట.
ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ సినిమాను అల్లు అర్జున్ పక్కన పెట్టేయటానికి కారణం.. ప్రభాస్ అంటున్నారు. అసలు ప్రభాస్‌కి అల్లు అర్జున్‌కి ఉన్న లింకేంటనే సందేహం రావచ్చు. అసలు విషయం ఏంటంటే.. బాలీవుడ్ తర్వాత బాలీవుడ్ మేకర్స్‌తో సినిమాలు ప్రభాస్ ఆసక్తి చూపించారు. ఆ క్రమంలో ఓం రౌత్‌తో కలిసి ఆదిపురుష్ సినిమా చేశారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్‌తో సినిమాలు చేయటానికి ఆసక్తి చూపించటం లేదు. అదే ప్రభావం ఇప్పుడు అల్లు అర్జున్‌పై పడింది. దీంతో బన్నీ సైతం ది ఇమ్మోర్టల్ అశ్వత్థామను పక్కన పెట్టేశారు.
ఉరి సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ కొట్టిన ఆదిత్యధర్.. ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ సినిమాను డ్రీమ్ ప్రాజెక్ట్‌గా కంప్లీట్ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు బన్నీ ప్రాజెక్ట్ చేయనని చెప్పేసినట్లు టాక్. ఇప్పుడు డైరెక్టర్ మరో హీరోని వెతుక్కునే పనిలో ఉన్నారు.