English | Telugu
21 ఏళ్ల కుర్రాడిగా నితిన్ ... సీక్రెట్ దాస్తున్న మేకర్స్
Updated : Aug 8, 2023
టాలీవుడ్‌కి చెందిన యంగ్ హీరోస్‌లో నితిన్ ఒకరు. భీష్మతో భారీ హిట్ సాధించిన ఈ కథానాయకుడికి తర్వాత సరైన హిట్ మాత్రం రాలేదు. ఇప్పుడు రెండు సినిమాలతో నితిన్ బిజీగా ఉన్నారు. అందులో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుండగా మరో సినిమాను వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్నారు. వక్కంతం వంశీ డైరెక్షన్‌లో రూపొందుతోన్న సినిమాకు రీసెంట్‌గా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అందులో నితిన్ పాత్ర మూడు షేడ్స్‌లో కనిపించనుంది. అందులో రెండు షేడ్స్‌కు సంబంధించిన లుక్స్‌ను ఇప్పటికే విడుదల చేశారు.
అయితే ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్’లో నితిన్‌కి సంబంధించిన ఓ లుక్‌ను దర్శక నిర్మాతలు రివీల్ చేయలేదని, సీక్రెట్‌గా దాస్తున్నారనే వార్తలు మీడియా సర్కిల్స్‌లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ లుక్ స్పెషాలిటీ ఏంటో తెలుసా! అందులో నితిన్ 21 ఏళ్ల కుర్రాడిగా కనిపించబోతున్నారు. అయితే దీని కోసం ఆయనెలాంటి వర్కవుట్స్ చేసి బరువు తగ్గుతారోనని ఆలోచన రావచ్చు. కానీ.. నితిన్ అలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవటం లేదు. వి.ఎఫ్.ఎక్స్‌లో నితిన్ లుక్‌ని 21 ఏళ్ల కుర్రాడిగా చూపించబోతున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గానే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.
నితిన్ 32వ సినిమాగా రానున్న ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మేన్’ మూవీ ఇప్పటికే 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యమూవీస్ అండ్ ఎంటర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరో వైపు వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా షూటింగ్ కూడా సమాంతరంగా జరుగుతుంది.