English | Telugu

అలీ క‌న్ను.. స‌మంత బొడ్డుపై

అలీ.. తెర‌పై న‌వ్వులు పంచే ఈ న‌టుడు - వెనుక మాత్రం వ‌ల్గ‌ర్ జోకుల‌తో విసిగించేస్తుంటాడు. చేతికి మైకు దొరికితే చాలు... నోరు కంట్రోల్‌లో ఉండ‌దు. ఏది ప‌డితే అది మాట్లాడేసి అభాసు పాల‌వ్వ‌డం అలీకి అల‌వాటే. మొన్న‌టికి మొన్న స‌న్నాఫ్‌స‌త్య‌మూర్తి ఆడియో ఫంక్ష‌న్లో యాంక‌ర్‌ సుమ‌పై ఓ బూతు జోకు పేల్చాడు. ఆ త‌ర‌వాత సుమ గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చింద‌నుకోండి.. అది వేరే విష‌యం. ఇప్పుడు సన్నాఫ్ స‌త్య‌మూర్తి ఆడియో విజ‌యోత్స‌వ వేడుక‌లోనూ అంతే. ఈసారి స‌మంత‌ని టార్గెట్ చేశాడు. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి ఆడియో విజ‌యోత్స‌వ వేడుక విజ‌య‌వాడ‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మైకు ప‌ట్టుకొన్న అలీ.. మ‌ళ్లీ పేట్రేగిపోయాడు. తెర‌పై స‌మంత బొమ్మ‌ని చూపిస్తూ.. స‌మంత బొడ్డంటే చాలా ఇష్టం. అది విజ‌య‌వాడ బెంజ్ స‌ర్కిల్ లా గుండ్రంగా ఉంటుంద‌న్నాడు అలీ. దాంతో అక్క‌డున్న‌వాళ్లంతా ఘెల్లుమ‌న్నారు. ఆడ‌వాళ్లు సిగ్గుతో త‌ల వంచుకొన్నారు. మైకు ప‌ట్టుకోగానే స‌భ్య‌త సంస్కారం లేకుండా మాట్లాడితే ఎలా? పైగా అక్క‌డ స‌మంత కూడా లేదు. మ‌రెందుక‌లా రెచ్చిపోయాడో ఏంటో..? సుమ‌లానే స‌మంత కూడా అలీకి గ‌ట్టి వార్నింగ్ ఇస్తుందా? లేదంటే అదేదో కాంప్లిమెంట్ అంటూ స్వీకరిస్తుందా?? వెయిట్ అండ్ సీ.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...