Read more!

English | Telugu

అఖిల్ కు క్రిష్ కు కుదిరిందా..?

మనం, సోగ్గాడే చిన్ని నాయన లాంటి మెమరబుల్ హిట్స్ తో నాగార్జున తన కెరీర్లో అద్భుతంగా దూసుకెళ్తున్నా, తనయుల కెరీర్ పట్ల మాత్రం చాలా కేర్ తీసుకోవాల్సి వస్తోంది. అఖిల్ మొదటి సినిమానే వి వి వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసినా కలిసిరాలేదు. అందుకే తనకు షూటింగ్ గ్యాప్ లభించడంతో, ఇప్పుడు అఖిల్ ను సక్సెస్ చేసే పనిలో పడ్డారు. మొదటి సినిమా ఎక్కడ తేడా కొట్టిందో చూసుకుని ఇక తర్వాత చేయబోయే సినిమాకు ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకూడదని నాగ్ ప్లాన్.

ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో, మాస్ కమర్షియల్ లా కాకుండా కాస్త డిఫరెంట్ గా అఖిల్ ను చూపించాలంటే, కంచె లాంటి సినిమా తీసిన క్రిష్ కరెక్ట్ అని నాగార్జున అనుకుంటున్నారట.
దీని కోసం ఆయన క్రిష్ ను అఖిల్ తర్వాతి సినిమాకు డైరెక్టర్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. క్రిష్ కూడా అందుకు సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కంచె తో, వరుణ్ తేజ్ ను యాక్టర్ గా ఒక మెట్టు ఎక్కించిన క్రిష్, అఖిల్ లోని యాక్టర్ ను కూడా బయటికి తీస్తారని నాగార్జున విశ్వాసం. మరి క్రిష్ అఖిల్ కు ఏమాత్రం న్యాయం చేస్తాడో వేచి చూడాలి.